MLG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సీతక్క అన్నారు. గురువారం రోశయ్య వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక మంత్రిగా ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఎంతో సేవ చేసారని ఆమె తెలిపారు.