PDPL: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ఎదుట జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని సమీక్షించి నాణ్యత, పురోగతిపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అలాగే రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతులపై సమావేశం నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.