ELR: భీమడోలు కాలువగట్టు శ్రీకనకదుర్గమ్మ భవానీ పీఠం అమ్మవారి ఊరేగింపు మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. అలంకరించిన పంచ అశ్వవాహనంపై శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పంచకలశాలను ధరించి భవానీ మాలధారులు గ్రామంలో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. భవానీ పీఠం గురుస్వామి దుర్గారావు పర్యవేక్షణలో గ్రామక్షేమం, దేశక్షేమం కాంక్షిస్తూ అమ్మవారి గ్రామోత్సవంలో ఉరేగించారు.