CTR: పుంగనూరులోని 138 ప్రభుత్వ పాఠశాలల్లో రేపు తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరుగుతుందని ఎంఈవో నటరాజ రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ అలీమ్ భాషను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. విద్యా వికాసం, వివిధ అంశాలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని ఎంఈవో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తల్లిదండ్రులు హాజరుకావాలని కోరారు.