SKLM: నరసన్నపేటలోని ప్రైవేట్ కళాశాలలో ఇవాళ ‘శక్తి టీమ్’ ఆధ్వర్యంలో పోలీస్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఉపయోగించడం ద్వారా పోలీస్ సేవల లభిస్తాయన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులచే ‘శక్తి యాప్’ డౌన్లోడ్ చేయించారు.అనంతరం సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు విద్యార్థులకు తెలియజేశారు.