VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గుర్ల ఎస్సై నారాయణరావు ఇవాళ చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన తుప్పలను సిబ్బందితో తొలగించారు. చుక్కపేట జంక్షన్ లో తుప్పలు ఏపుగా పెరగడంవలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.