SKLM: దత్తాత్రేయ జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్న షిరిడి సాయిబాబాను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాబాకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.