TG: ఆదిలాబాద్‌కు విమానాశ్రయం కావాలని గతంలో సీఎంను అడిగినట్లు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్‌లో సీఎం పర్యటనలో పాల్గొన్న శంకర్.. నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డిని కలుస్తానని స్పష్టం చేశారు. చనాఖా-కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబిన్ పంటను కొనుగోలు చేయాలని సీఎంను కోరారు.