SRPT: రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జాజిరెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలలో స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులతో గురువారం పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.