VZM: మహిళలు కలలు కనాలని, కలలు నెరవేర్చుకోవడానికి లక్ష్యంతో పని చేయాలని గజపతినగరం ఏపీఎం పీ. నారాయణరావు అన్నారు. ఇవాళ గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో రెండవ రోజు విజన్ బిల్డింగ్ పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యురాలు యొక్క వ్యక్తిగత కలలను సభ్యులతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.