NLR: ఆత్మకూరు పట్టణంలో ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (DDO) కార్యాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యాలయ భవనాన్ని స్థానిక ఎంపీపీ చేత ప్రారంభించి అనంతరం కార్యక్రమంలో పాల్గొని టెలి కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర అధికారులతో మాట్లాడారు. డివిజన్ డెవలప్మెంట్ కోసం ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఆనం తెలిపారు.