AP: తిరుపతి శివారు దామినేడు వద్ద కాన్వాయ్‌ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిపారు. ప్లకార్డులతో వర్షంలో ఎదురుచూస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. 1962 సర్వేలో 175 ఎకరాలు పొరపాటుగా అనాధీనంగా చూపారని రైతులు తెలిపారు. ఇనాం ఎస్టేట్ గ్రామంగా ఉన్నప్పుడు 26 కుటుంబాలు శిస్తులు చెల్లిస్తున్నాయని చెప్పారు. తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు కావాలని కోరారు.