JN: చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.73 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం తెలిపారు. వంగ శివకుమార్ అనే వ్యక్తి ఇంట్లో గతరాత్రి దాడి చేసి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే శివకుమార్‌ను అరెస్ట్ చేసారు. విచారణ నిమిత్తం అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించామని పోలీసులు చెప్పారు.