ADB: ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలి ప్యాడ్లో ల్యాండ్ అయ్యారు. వెంటనే నేరుగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.