TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్సభలో బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారిందని గుర్తుచేశారు. కోతుల సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని.. అసలు కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలని లోక్సభలో కోరారు.