MDK: తూప్రాన్ పట్టణ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సన్న రేషన్ బియ్యం 28 టన్నులు పట్టుకున్నట్లు విజిలెన్స్ డీ.ఎస్.పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు వివరించారు. లారీని పట్టుకొని రేషన్ బియ్యాన్ని గోదాములో నిలువ చేసినట్టు తెలిపారు. పౌర సరఫరాల శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింలు ఫిర్యాదు చేశారు.