MBNR: పొగ మంచు సమయంలో ప్రజలు తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాలు నివారించడం కోసం డ్రైవర్లు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్లు అతివేగం ఓవర్ టేకింగ్ నిరోధించాలన్నారు. హై బీమ్ స్థానంలో లో బీమ్ ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు.