NGKL: జిల్లా కేంద్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ప్రొసీడింగ్, సహాయ ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, భద్రతా చర్యలు, మెటీరియల్ వినియోగంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.