TG: ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. 2010 ఆగస్టు 23కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా TET పరీక్షను తప్పనిసరి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనివల్ల లక్షలాది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కులను రక్షించడానికి కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.