Bandi sanjayకు నోటీసులు ఇచ్చిన సిట్.. 24న విచారణకు హాజరు కావాలని ఆదేశం
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో ఆరోపణలు చేసిన విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని బండి సంజయ్‌ని సిట్ కోరింది. కొశ్చన్ పేపర్ లీక్ కాగా.. ఒకే ఊరిలో చాలా మందికి100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూడా ఇలా ఆరోపణలు చేయగా.. సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆధారాలతో సహా రావాలంటూ సిట్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది. ఆ మరునాడు.. బండి సంజయ్‌ను విచారించనుంది.
పేపర్ లీకేజీ అంశం తెలంగాణ రాష్ట్రంలో అగ్గిరాజేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు కదం తొక్కాయి. సిట్ (sit) విచారించిన కేసులు నీరు గారిపోయాయని చెబుతున్నారు. లీకేజీ కేసును సీబీఐకి (cbi) అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రశ్నపత్రాల లీకేజీలో (TSPSC paper leak) ప్రధాన నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో (Praveen pen drive) మొత్తం 5 పేపర్లను గుర్తించారు. వాటిలో ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్ల పరీక్ష జరగలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ప్రవీణ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు ఇప్పటికే కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.