»Delhi Weather Station Records 52 9c Highest In Indias Highest Temperature With Rajasthans Phalodi At 50 Degrees
Summer : రాజస్థాన్‌లో 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు! దిల్లీలో 52.9 డిగ్రీలు నిజమా?
ఈ వేసవి మొదలైన దగ్గర నుంచి బుధవారం రాజస్థాన్‌లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఐఎండీ తెలిపింది. దిల్లీలోనూ ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
summer temperature : దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బుధవారం రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు(temperatures) నమోదు అయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ మీదుగా వీస్తున్న వేడి గాలుల వల్ల దేశ రాజధాని దిల్లీ సైతం అట్టుడుకుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.
దేశ రాజధాని దిల్లీలో(Delhi) బుధవారం మధ్యాహ్నం 2 :30 గంటల సమయంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత (temperature) నమోదైందని వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ కులదీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. మన దేశం మొత్తం మీద ఇప్పటి వరకు ఇలాంటి ఉష్ణోగ్రత నమోదు కాలేదని ఆయన తెలిపారు. అందుకనే దాన్ని మరోసారి నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు తెలిపారు.
కొన్ని సార్లు వాతావరణ శాఖ డాటాలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఐఎండీ అధికారుల ప్రత్యేక బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా నిన్న రాజస్థాన్‌లోని ఫలోదీలో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది భారత్‌లో హయ్యెస్ట్ రికార్డు(record) ఉష్ణోగ్రత. ఆ పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణా రాష్ట్రంలోని సిర్సాలో 50.3 డిగ్రీలు, దిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే దిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయమై అధికారిక ప్రకటన చేస్తామని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.