కాంగ్రెస్ నేత శశి థరూర్ పీఏ దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని థరూర్ స్పష్టం చేశారు.
Shashi Tharoor : కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఒకరిగా ఉన్న శశి థరూర్ పీఏ(PA) బుధవారం రాత్రి దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్(gold smuggling) చేస్తూ పట్టుబడ్డారు. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని అరెస్టు(ARREST) చేశారు. ఈ విషయమై శశి థరూర్ సైతం స్పందించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
శశి థరూర్(SHASHI THAROOR) పీఏ అయిన శివ కుమార్‌తో పాటు మరొకరిని పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35.22 లక్షలు ఉంటుంది. దీంతో ఈ విషయంపై శశి థరూర్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ విషయం తెలుసుకుని తాను షాక్‌కి గురయ్యానని వెల్లడించారు. ఈ వ్యక్తి తన మాజీ సిబ్బందిలో ఒకరని ఆయన పేర్కొన్నారు.
శివ కుమార్ వయసు 72 ఏళ్లు అని తరచు డయాలసిస్ చేయించుకుంటాడని శశి థరూర్(SHASHI THAROOR) తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్‌కి సంబంధించిన పనుల్లో అతడు పార్ట్‌టైంగా తన వద్ద పని చేస్తున్నట్లు రాశారు. ఈ అరెస్టుతో తనపై వస్తున్న ఆరోగపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తునకు తాను అన్ని రకాలుగానూ సహకరిస్తానని క్లారిటీ ఇచ్చారు.