Puri Fire crackers Explosion : పూరీ పుణ్య క్షేత్రంలో ప్రమాద వశాత్తూ బాణసంచా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 30కి గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బుధవారం రాత్రి ఒడిస్సాలోని( ODISHA) పూరీలో ఉన్న నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడికి చందనోత్సవం జరిపారు. దీన్ని వీక్షించేందుకు వందలాది మంది పుష్కరిణి దగ్గరకు వచ్చారు. అక్కడే టపాకాయలు పేల్చడం ప్రారంభించారు. ఆ నిప్పు రవ్వలు ఎగిరి వెళ్లి దగ్గరలో నిల్వ ఉంచిన బాణసంచా(FIRECRACKER) దగ్గర పడ్డాయి. దీంతో అక్కడ పెద్ద పేలుడు(EXPLOSION) జరిగింది. మంటలకు తాళలేక దురదృష్ట వశాత్తూ ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో సైతం కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేస్తామని స్పష్టం చేశారు.