Temperature Fall In Telangana: తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోతున్నాయి. దీంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు, మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిసింది. తర్వాత చలి తగ్గముఖం పడుతుందని అధికారి శ్రావణి తెలిపారు.
డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి చలి పెరగడంతో పాటు శీతల గాలులు వీస్తాయని వివరించారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని తెలిపారు. హైదరాబాద్.. శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్పల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు యావరేజీగా 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండురోజులుగా తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.