»Rajinikanth Rajinikanth Dance Is This Ambanis Wedding
Rajinikanth: ‘రజినీకాంత్’ డ్యాన్స్.. ఇది అంబానీ పెళ్లి అంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సినిమాల్లో చాలా స్టైలిష్‌గా చూసి ఉంటారు. కానీ రియల్ లైఫ్ రజినీ వేరు. నిజ జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారు సూపర్ స్టార్. అలాంటి రజినీ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. కానీ అంబానీ పెళ్లిలో అది జరిగింది.
Rajinikanth: 'Rajinikanth' dance... is this Ambani's wedding?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌ను రియల్ లైఫ్‌లో చూస్తే.. కొందరు గుర్తు కూడా పట్టలేనంత సింపుల్‌గా ఉంటారు. అసలు సూపర్ స్టార్ సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. దగ్గరి నుంచి చూస్తే.. మనం నిజంగానే సూపర్ స్టార్‌ను చూస్తున్నామా? అనే సందేహాలు రాక మానదు. కానీ.. అదే సూపర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే.. థియేటర్లు తగలబడిపోతాయ్. జస్ట్ రజినీ అలా నిలబడితే చాలు.. బాక్సాఫీస్ బద్దలవుతుంది.. అనడానికి జైలర్ సినిమా రిజల్ట్‌ను ఓ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు.
#Rajinikanth dances for the first time in real life at Ambani son's wedding.
ఇక రజినీ డ్యాన్స్‌ను మనం ఇప్పటి వరకు తెరమీదే చూశాం. కానీ బయట కూడా రజినీ డ్యాన్స్ చేస్తారా? అందులోను పెళ్లిలో డ్యాన్స్ అంటే? అస్సలు ఊహించి ఉండరు. కానీ అక్కడుంది అంబానీ ఫ్యామిలీ కాబట్టి.. సూపర్ స్టార్ కూడా అనంత్ అంబానీ పెళ్లిలో డ్యాన్స్‌తో రచ్చ చేశారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం జూలై 12న చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి ఖర్చు ఏకంగా నాలుగైదు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.
ఇక సెలబ్రిటీతై డ్యాన్స్‌లతో అదరగొట్టారు. పాటలతో హోరెత్తించారు. ఈ క్రమంలో రజినీకాంత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పెళ్లిలో రజినీకాంత్ డ్యాన్సే హైలైట్‌గా నిలిచిందని చెప్పలి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి ‘గల్లన్ గుడియా’ పాటకు రజినీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు రజినీకాంత్. ఇక టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్, మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.