VSP: జిల్లాలోని తిమ్మాపురం బీచ్లో గుర్తుతెలియని ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. 70 సంవత్సరాలు వయసు ఉన్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆమె ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.