»Samantha Samantha Is Changing The Place Thats Why You Dont Agree
Samantha: మకాం మారుస్తున్న సమంత.. అందుకే ఒప్పుకోవడం లేదా?
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సినిమాల పరంగా చాలా స్పీడ్ పెంచింది సమంత. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. కానీ మయోసైటిస్ కారణంగా డీలా పడిపోయింది. కానీ ఈసారి మాత్రం మకాం మార్చడం పక్కా అని అంటున్నారు.
Samantha: ఊహించని విధంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో.. కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సామ్ పూర్తిగా కోలుకుంది. దీంతో అమ్మడు మళ్లీ రంగంలోకిది దిగిపోయింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సిటాడెల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది సామ్. అయితే.. ఇకపై సామ్ బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటోందట. దాంతో ముంబైలోనే ఉండాలని భావిస్తోందట. అయితే ఆల్రెడీ సమంతకు హైదరాబాదులో ఒక ఫ్లాట్ ఉంది. సొంత సిటీ చెన్నైలో ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ముంబైకి షిప్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
గతంలోనే ఈ వార్తలు వచ్చినప్పటికీ.. ముంబైలో ఉండేందుకు ఓ మంచి ఇల్లు వెతుకుతోందట. షూటింగ్ ఉంటేనే హైదారాబాద్, చెన్నైకి రావాలని అనుకుంటోందట. ముంబై నుంచే అమ్మడు బాలీవుడ్ సినిమాల వ్యవహారం చూసుకోబోతోందట. గతంలోనే సమంత మేనేజర్ని మార్చేసిందని వార్తలొచ్చాయి. కాబట్టి ఇక పై సామ్ మకాం దాదాపుగా మారినట్టేనని అంటున్నారు. అందుకే సౌత్ సినిమాలకు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. చాలా మంది నిర్మాతలు సమంతను సంప్రదించినా కూడా ఓకె చెప్పడం లేదట.
సౌత్‌లో సమంతకి మంచి డిమాండ్ ఉంది. అయినా కూడా బాలీవుడ్ సినిమాల కోస సైలెంట్‌గా ముంబై చెక్కేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ తర్వాత వరుసగా హిందీ సినిమాలు చేసేలా.. పక్కా ప్లాన్ రెడీ చేసుకుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఇకపై తెలుగు సినిమాల్లో సమంతను చూడలేమనే చెప్పాలి.