Padma Vibhushan: మెగాస్టార్‌కి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే ఈరోజు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు.
Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది. అయితే ఈరోజు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేసిన కృషి, సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డుల వేడుకకు రామ్‌చరణ్ దంపతులు కూడా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన చిరంజీవికి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. దీంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి పునాదిరాళ్లు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. అలా వరుస సినిమాల్లో నటించి హిట్ కొట్టి స్టార్డమ్ దక్కించుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో రికార్డులు సృష్టించారు. 2007తర్వాత దాదాపు 10 ఏళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చారు. 2006లో అప్పటి భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. అలాగే 2022లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన పేరుతో రక్తదానం, నేత్రదానం ట్రస్ట్‌లు కూడా ఉన్నాయి.