ATP: బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఎర్రమట్టి అక్రమ దందాపై వార్త రాసినందుకు దాడికి గురైన ఓ పత్రిక విలేఖరి పెద్దన్నను మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సై రామ్‌ప్రసాద్‌ను ఫోన్లో కోరారు.