ASR: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లలోనే ఉండాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైసీపీ నాయకులు అండగా ఉండాలని ఆయన తెలిపారు. అనంతగిరి మండలం కాశీపట్నంలో నాయకులతో సమావేశం నిర్వహించి తుఫాన్ పరిస్థితులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.