»Tamanna Shocking Tamanna Going To Be A Mother Without Marriage
Tamanna: షాకింగ్.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లో నిలుస్తున్న తమ్ము.. ఇప్పుడు ఏకంగా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?
Tamanna: Shocking.. Tamanna going to be a mother without marriage?
Tamanna: రీసెంట్‌గానే బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్ము ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది. సినిమాలే కాదు హాట్ హాట్ వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే.. ప్రేమ వ్యవహారంలో కూడా హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా అతనితోనే కలిసి వెళ్తోంది.
గతేడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించి రెచ్చిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. ఈ ఇద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లి పీఠలెక్కడం ఖాయమని అనుకున్నారు. ఇప్పటికే తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు తల్లి దండ్రులు కావాలనే ఆలోచనలో ఉన్నారట. లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ ప్రకారం.. తమన్నా, విజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పెళ్లి కాకముందే ఓ బిడ్డను కనాలని అనుకుంటున్నారట. అంతేకాదు.. ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని భావిస్తున్నారట. అప్పటికైతే.. బాధ్యతలు మరింత బాగా తెలుస్తాయని ఆలోచనలో ఉన్నారట. దీంతో.. ఇదేం విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కలిసుండాలనే కదా పెళ్లి, పిల్లలు కనేది. కానీ ముందే.. ఇలా చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. కానీ అసలు ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.