»Thalapathy Vijays Leo Inches Away From Beating Rajinikanth Starrer Jailers Ticket Sales
Leo: జైలర్‌ను బీట్ చేసిన లియో ఫస్డ్ డే బుకింగ్స్!
దళపతి విజయ్ సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే.. దానికి తోడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తోడైతే అది కచ్చితంగా మాస్ రాంపేజ్ అని లియో నిరూపిస్తోంది. ఫస్ట్ డే బుకింగ్స్ చూస్తుంటే అర్థం అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రాన్నే బీట్ చేసేలా ఉంది.
Thalapathy Vijay’s Leo Inches Away From Beating Rajinikanth Starrer Jailer’s Ticket Sales
Leo: దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం లియో(Leo) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది. ఊహించినట్లుగానే, అడ్వాన్స్ బుకింగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి కొత్త రికార్డులవైపు అడుగులు వేస్తోంది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం డే 1 అడ్వాన్స్ బుకింగ్(Advance booking)లో రజనీకాంత్(Rajinikanth) జైలర్‌ను అధిగమించడానికి కాస్త దూరంలో ఉందని చెబుతున్నారు. దీనికి తోడు గత సినిమాలతో దుమ్ములేపిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) లియోకు అదనపు అట్రాక్షన్‌గా మారారు. ఇది కచ్చితంగా ఊరమాస్ ఎలివేషన్స్‌తో, యాక్షన్ ప్రధానంగా సాగుతుందని అర్థం అవుతోంది. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్‌లో ఓ రేంజ్లో అవుతున్నాయి.
ఇటీవలే లియో అడ్వాన్స్ బుకింగ్ దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. టిక్కెట్లు హాట్ కేక్‌ల్లా అమ్ముడవుతున్నాయి. తలపతి విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై, కొచ్చి, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ చిత్రం ర్యాంపేజ్ మోడ్‌లో ఉంది. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, లియో దేశవ్యాప్తంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లో 17 కోట్ల గ్రాస్‌ను దాటినట్లు తెలిస్తోంది. ఇదే వేగంతో కొనసాగితే రజనీకాంత్ జైలర్‌ను అధిగమిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. జైలర్ చిత్రం 18.50 కోట్ల రూపాయలు ఫస్ట్ డే బుకింగ్స్ చేసింది. తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో అన్ని థియేటర్లు బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు. జైలర్ చిత్రాన్ని అధిగమించే అవకాశం క్లియర్ కనిపిస్తోంది.