మనీష్ శర్మ, సల్మాన్ ఖాన్ కాంబోలో రానున్న 'టైగర్-3'(Tiger-3) చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
Tiger-3: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్-3′(Tiger-3). మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పఠాన్(Pathan) లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం టైగర్-3. సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో సల్మాన్‌ఖాన్ ఒక సీక్రెట్ రా ఏజెంట్. అతను తన కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్లు ట్రైలర్లో తెలుస్తుంది. ఆ సమయంలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసాడని ప్రచారం జరుగుతుంది. ఇలాంటప్పుడు తన నిజాయితీని ఎలా ఫ్రూవ్ చేసుకున్నాడనేది కథ.
Tiger se dushmani sabko bhaari padti hai. This time it’s personal!
టైగర్-3లో సల్మాన్ ఖాన్ పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నాడు. దానికి తోడు కత్రినా కైఫ్ అందం. స్టంట్స్ మూవీ హైప్ ఇంకా పెంచాయి. ట్రైలర్లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇందులో కత్రినా కూడా ఫుల్ యాక్షన్‌లో కనిపించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించి షారుక్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టైగర్-3 సినిమాలో షారుక్ గెస్ట్ అప్పిరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం.