Rashmika Mandanna: రష్మికకు బిగ్ ఆఫర్.. ఏకంగా సల్మాన్‌తో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. అమ్మడు ఏ సినిమా చేసిన హిట్ అనేలా ఉంది. తాజాగా బాలీవుడ్లో మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.
Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన ఈ కన్నడ బ్యూటీ.. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ముఖ్యంగా అనిమల్ సినిమా తర్వాత బాలీవుడ్ పై మరింత ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో.. ఏకంగా సల్మాన్ ఖాన్‌తో బంపర్ ఆఫర్ కొట్టేసింది. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ‘సికందర్’ అనే టైటిల్‌తో అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఈద్‌కి ‘సికందర్’ మిమ్మల్ని కలుస్తాడు.. అంటూ రీసెంట్‌గానే తెలిపాడు సల్మాన్ ఖాన్. ఇక ఇప్పుడు సింకదర్కు జంటగా రష్మిక మందన్న నటిస్తుందని ప్రకటించారు మేకర్స్.
ఈ విషయాన్ని రష్మిక కూడా స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మామూలుగా అయితే.. మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే రష్మిక ఇంకెం ఆలోచించకుండా ఈ సినిమాకు ఓకె చేసిందని అంటున్నారు. పైగా సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ అనేసరి అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి.. రష్మికకు ఇది భారీ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అమ్మడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప2తో పాటు.. ధనుష్ ‘కుబేర’లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే.. రెయిన్ బో, గార్ల్‌ఫ్రెండ్ అనే లేడీ ఓరియెంటేడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఏదేమైనా.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ.