Everything is to your liking.. Janhvi Kapoor's post on marriage news is viral
Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసింది. ఆమె పెళ్లి గురించి ఓ పోస్ట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో స్పందించింద. ప్రస్తుతం తన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంతకి విషయం ఏంటంటే జాన్వీ కపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ విషయాన్ని తనకు డైరెక్ట్‌గా చెప్పింది అంటూ ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వార్త తెగ ట్రెండ్ అయింది. దీనిపై జాన్వీ సిరీస్ అయింది. మీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తారా అంటూ సీరియస్‌గా స్పందించింది.
అయితే ఈ వార్తలకు ఆధారం శిఖర్ పహారియా అని చాలా మందికి తెలుసు. ఆయన మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. జాన్వీ కపూర్‌కు మంచి స్నేహితుడు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమయాణం నడుస్తుంది అనేది నెట్టింట్లో జరుగుతున్న ప్రచారం. గతంలో చాలా ఇంటర్వ్యూలలో శిఖర్ పహారియా గురించి జాన్వీకపూర్ చెప్పడం అంతేకాకుండా తాను ధరించిన ఓ నెక్లెస్‌కు శిఖు అనే లోగో ఉండడంతో అందరికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని నమ్మారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి త్వరలో పెళ్లి అనే వార్తులు సైతం వస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది. ఆ తరువాత ఆర్సీ17 చిత్రంలో సైతం రామ్ చరణ్ సరసన నటిస్తుంది.