»Bishnoi Gangs Plot To Kill Salman Khan Rs 25 Lakh Contract Modern Weapons
Salman Khan : సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్
ఈ మధ్య కాలంలో ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే వివరాలు తెలిశాయి. సల్మాన్ ఖాన్ని హత్య చేసేందుకు పక్కాగా కుట్ర పన్నిన వైనం తెలిసింది.
Salman Khan : బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ హత్యకు పెద్ద కుట్రే జరిగింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను(Bishnoi Gang) ఆయనను హతమార్చేందుకు పక్కాగా ప్లానింగ్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసును విచారిస్తున్న పోలీసులు పెద్ద కుట్ర గురించి తెలుసుకోగలిగారు. గత కొంత కాలంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) సల్మాన్‌ని చంపేందుకు పక్కాగా స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు.
నవీ ముంబయిలో సల్మాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పుల కేసులో పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అందులో వారు పలు విషయాలను పేర్కొన్నారు. 2023 ఆగస్ట్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో సల్మాన్‌ని హత్య చేయించేందుకు వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆయనను చంపేందుకు అదునాతన ఆయుధాలను(Weapons) కొనుగోలు చేసేందుకు చూశారు. ఏకే47, ఎం16, ఏకే92 తుపాలకులను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేసేందుకు చూశారు.
పాక్ ఆయుధాల వ్యాపారం చేసే వ్యక్తితో ఈ ముఠా టచ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. సల్మాన్‌ని(Salman) హత్య చేసేందుకు దాదాపుగా 70 మంది పలు చోట్ల రెక్కీ నిర్వహించారు. సల్మాన్ ఫాం హౌస్, బాంద్రాలోని ఆయన నివాసం దగ్గర, పరిసర ప్రాంతాల్లో వీరు సల్మాన్ కదలికలపై కన్నేసి ఉంచారు. ఏప్రిల్ 14న గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపి చివరికి పట్టుబడ్డారు. వారిని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నారు. నిందితుల్ని విక్కీ గుప్తా, సాగర్ పాల్లుగా గుర్తించారు.