Salaar: యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ సలార్ (Salaar) కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎడిటింగ్ వర్క్ నేపథ్యంలో విడుదల ఆలస్యమైంది. లేకుంటే గత నెలలోనే రిలీజ్ అయ్యేంది. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు మందుకు రాబోతుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషించారు. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
మూవీలో వర్ధరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నించారు. బర్త్ డే సందర్భంగా ఆయన పోస్టర్‌ను మలయాళం, ఇంగ్లీష్‌లో విడుదల చేసింది. బర్త్ డే శుభాకాంక్షలను తెలియజేసింది. సలార్ మూవీ తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. మూవీపై ప్రభాస్ అభిమానులు ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. బాహుబలి తర్వాత ఆయనకు మంచి హిట్ దక్కలేదు.
సలార్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. కేజీఎఫ్ సిరీస్‌తో ప్రశాంత్ నీల్ అంటే ఏంటో ఒక హైప్ ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అని డార్లింగ్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. సలార్ తర్వాత సమ్మర్లో ప్రభాస్ కల్కీ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఆ మూవీపై కూడా మంచి హైప్స్ ఉన్నాయి.