Daggubati Abhiram: దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram).. రానా నాయుడు మనవడు. చిన్నప్పటి నుంచే రాయల్ లైఫ్.. వివాదాలు కూడా ఎక్కువే.. శ్రీ రెడ్డి అయితే ఏకంగా అభిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకొండి.. ఫస్ట్ మూవీ అహింస ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేదు. తర్వాత మూవీస్ ఆఫర్స్ వచ్చిన చేయలేదు. నటనలో మరింత మెళకువలు నేర్చుకోవాల్సి ఉందని చెబుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇంతలో రైటర్స్ కేఫ్ ఏర్పాటు చేశారు.
రామా నాయుడు (Rama Naidu) స్టూడియోలోనే రైటర్స్ కేఫ్ ఉంది. సినిమా డిస్కషన్స్ చేసే యువ రచయితల కోసం దీనిని ఏర్పాటు చేశారు. సిటీలో చాలా ఉన్నప్పటికీ దీని ప్రత్యేకత వేరు. అలాగే తన లైఫ్‌లో వచ్చిన కాంట్రవర్సీ గురించి కూడా అభిరామ్ స్పందించారు. తాతయ్య రామా నాయుడు చనిపోయిన తర్వాత జీవితం విలువ తెలిసిందని చెప్పారు. అప్పటినుంచి తనకు బాధ్యత తెలిసిందని చెప్పుకొచ్చారు. అందుకే కేఫ్ ప్రారంభించానని వివరించారు.
తనపై కాంట్రవర్సీ వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లడానని గుర్తుచేశారు. ఇష్యూ గురించి అందరం ఓపెన్‌గా మాట్లాడమని స్పష్టంచేశారు. కొన్ని ఘటనల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెట్టారని రూమర్స్ వచ్చాయి. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అదేం లేదని, అవన్నీ అపోహలు అని కొట్టిపారేశారు.