»Give Priority Palle Velugu Buses For Short Distance
Palle Velugu: ఇదేంది సారూ.. మహిళా ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్
ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ ప్రెస్ బదులుగా పల్లెవెలుగు ఎక్కాలని సూచించారు.
Give Priority Palle Velugu Buses For Short Distance
Palle Velugu: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు (women) ఫ్రీ బస్సు పథకం కొనసాగుతోంది. ఆ స్కీమ్‌కు ఆడవాళ్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పల్లెవెలుగు బస్సుల కన్నా ఎక్స్ ప్రెస్‌లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారని తెలిసింది. అలా ఎక్కిన వారు కూడా తక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నారని సమాచారం. దీంతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఏమన్నారంటే..?
తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్స్ ప్రెస్ బదులు పల్లె వెలుగు బస్సు ఉపయోగించాలని కోరారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మిగతా ప్రయాణికుల దృష్ట్యా ఈ సూచనను ఫాలొ కావాలని మరీ మరీ కోరారు. దీంతో కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలో బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసిందని సజ్జనార్ వివరించారు. అలా చేయొద్దని.. స్టేజీల్లో మాత్రమే ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపుతారని.. సిబ్బందికి సహకరించాలని కోరారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని సజ్జనార్ తెలిపారు. ఇందుకు సహకరిస్తోన్న సిబ్బంది, ప్రయాణికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. దీంతోపాటు ఒక్కో మహిళకు రూ.2500, అలాగే రూ.500కే సిలిండర్ ఇవ్వాల్సి ఉంది.