»A College Girl Crying Due To Not Get A Seat In The Bus
Busలో రద్దీ.. ఎక్కేందుకు చోటు లేక ఏడ్చేసిన విద్యార్థిని
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
A College Girl Crying Due To Not Get A Seat In The Bus
A College Girl Cry: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ పథకం కొనసాగుతోంది. తొలి వారం ఏ ధ్రువీకరణ పత్రం అడగలేదు.. ఆ తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తే.. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్లో ఫ్రీ జర్నీ.. దీంతో కొందరు అవసరం ఉన్నా.. లేకున్నా బయటకు వస్తున్నారు. రోజు అలా సరదాగా తిరిగేసి వస్తున్నారు.
వాస్తవానికి ఇలా ఓ 50 శాతం మంది ఊరికేనే జర్నీ చేస్తున్నారు. నిజంగా అవసరం ఉన్నా.. తిరిగేవారికి ఇబ్బంది అవుతోంది. ఇలాంటి ఘటన జగిత్యాల (jagtial) జిల్లాలో జరిగింది. జగిత్యాల నుంచి ఓ పల్లెవెలుగు బస్సు రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. ఆ బస్సు మహిళలతో నిండిపోయింది. ఆ బస్సే చివరిది కాగా.. బస్సులో సీటు కదా.. ఎక్కేందుకు చోటు కూడా లేదు. ఇంకేముంది.. ఆ విద్యార్థిని కోపం కట్టలు తెంచుకుంది.
ఇలాంటి పథకాల వల్ల తమలాంటి వారి పరిస్థితి ఏంటి అని అడుగుతోంది. తాము వెళ్లేందుకు వీలు లేదని.. మరో బస్సు వేయాలని కోరుతుంది. అలా ఏడుస్తూ వెళుతుండగా కొందరు వీడియో తీసి షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి చెప్పిన దానిలో న్యాయం ఉంది. రోజు పని మీద వచ్చి.. ఇంటికెళ్లే చివరి బస్సులో సీటు లేక ఉండిపోయింది. తమలాగా మరొకరికి ఇలా జరగొద్దని కోరుతుంది. సో.. ఆ విద్యార్థిని లాగా మరొకరికి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.