Bus Falls Into Ravine : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి వంతెన కింద ఉన్న లోయలోకి పడిపోయింది. దీంతో 28 మంది మృతి చెందారు. దక్షిణ బలూచిస్థాన్‌లోని(Balochistan) టర్బాట్ నగరం దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో అది అదుపు తప్పింది. దీంతో 750 లోయలోకి పడిపోయింది.
పాకిస్థాన్‌లో(Pakistan) జరిగిన ఈ దుర్ఘటనలో బస్సును(Bus) నడుపుతున్న డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన వారిని లోయలో చిక్కుకున్న బస్సు నుంచి వెలికితీశారు. క్షతగాత్రులను హెలీకాఫ్టర్ల సహాయంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ అతి వేగంగా బస్సును నడుపుతున్నాడని బాధితులు చెబుతున్నారు.
పాకిస్థాన్(Pakistan) ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ప్రమాదం పట్ల స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడి ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారు తొందరగా కోలుకునే విధంగా వైద్యం అందించాలని కోరారు.