»A Man Protested In Front Of The Bus To Give Seats To Men Too Armoor Nizamabad
Protest: పురుషులకు కూడా సీట్లు ఇవ్వాలని ఓ వ్యక్తి బస్సు ఎదుట నిరసన
మగవాళ్లు బస్సులు ఎక్కలేకపోతున్నారని, ఎక్కడా స్థలం దొరక్కపోవడంతో ప్రయాణం కూడా చేయలేకపోతున్నారని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే బస్సు నుంచి దిగి ఆగ్రంహంతో బస్సు ముందు రోడ్డుపై నిలబడి నిరసన తెలిపాడు. దీంతో పలు బస్సులు అక్కడే నిలిచిపోయాయి.
A man protested in front of the bus to give seats to men too armoor nizamabad
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓ వ్యక్తి గుండెల్లో గుబులు పుట్టించింది. అయితే ఈ మనిషిలాగా ఎంతమంది మగవాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారో ఎవరికీ తెలియదు. కానీ గత వారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మహిళల కోసం ఉచిత బస్సు సర్వీస్‌ను ప్రారంభించిన వెంటనే, అనేక మీమ్స్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లను మీమ్స్స జోకులు వైరల్ అవుతున్నాయి. ఉచిత బస్సు(free bus) ప్రయాణం ద్వారా పురుషులకు ఇబ్బంది అవుతుందని, అనేక మంది మహిళలు పురుషుల సీట్లలో కూడా కుర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది పురుషులైతే బస్సులో ఎక్కిన మహిళల రద్దీని చూసి బస్సులు ఎక్కేందుకే బయపడుతున్నారని అంటున్నారు.
ఈ వ్యక్తి శనివారం ఉదయం నిజామాబాద్(nizamabad) జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి నిరసన తెలిపాడు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం చేస్తున్న సంకల్పం అభినందనీయమన్నారు. అంతేకాదు ప్రతి ఇంటిలోని స్త్రీలు – గృహిణులు, ఆడపిల్లలు – అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అయితే బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించి, వారికి కూడా ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక బస్సులో 30 సీట్లు ఉంటే, 20 మహిళలకు ఇవ్వండి కానీ “దయచేసి పురుషులకు 10 ఉంచాలని కోరుతున్నాడు. వారికి ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల మగవాళ్లు బస్సులు ఎక్కలేకపోతున్నారని అతను అంటున్నాడు. ఎక్కడా స్థలం దొరక్కపోవడంతో ప్రయాణం కూడా చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తి నిరసన తెలుపుతున్న బస్సు ముందు పలువురు వ్యక్తులు గుమిగూడటంతో కొన్ని బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత అతనికి పలువురు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.