»Gurukula Candidates Protest On Their Knees At Cm Revanth Reddys House
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు మోకాళ్లపై నిరసన
గురుకులు నియామకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిముందు మోకాళ్లపై నిరసనకు దిగిన అభ్యర్థులు. తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
Gurukula candidates protest on their knees at CM Revanth Reddy's house
CM Revanth Reddy: గురుకులు నియామకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిముందు మోకాళ్లపై నిరసనకు దిగిన అభ్యర్థులు. తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గురుకుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి గురుకుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బోర్డు చేసిన తప్పులకు తమ జీవితం బలి అవుతున్నట్లు, గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగలేదని, ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. దీనివలన చాలా మంది నష్టపోయారు అని ప్రభుత్వం ఇప్పటికైన సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తాము కూడా కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినా తమకు ఉద్యోగం మాత్రం రాలేదని వాపోతున్నారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగదీశారు, ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి.. ఇప్పటికైనా తమకు న్యాయం జరగకపోతే ఇంకెప్పుడు జరగదని గురుకులు అభ్యర్థులు వాపోతున్నారు.