Sreeleela: తగ్గేదేలే అంటోన్న బ్యూటీ.. డార్లింగ్‌తో మూవీకి రూ.5 కోట్లు డిమాండ్
ప్రభాస్‌తో చేసే మూవీకి యంగ్ బ్యూటీ శ్రీలీల రూ.5 కోట్ల నగదు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అయినా సరే రెమ్యునరేషన్ తగ్గించుకోనని కరాఖండిగా చెప్పేస్తోంది బ్యూటీ.
Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీ లీల తగ్గేదేలే అంటోంది. వరస సినిమా అవకాశాలతో బిజీగా ఉంటోంది. ఇప్పుడు చేతిలో 8, 9 సినిమాల వరకు ఉన్నాయి. స్టార్ డమ్ రావడంతో రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. తొలుత రూ.కోటి తీసుకున్న అమ్మడు.. తర్వాత రూ.2 కోట్లు తీసుకుంది. ఇప్పుడు మూవీకి రూ.5 కోట్లు అంటోందట. దీంతో కొందరు నిర్మాతలు ఆశ్చర్య పోతున్నారు.
యాక్ట్ చేసే సమయంలో చిన్న, పెద్ద అనే తేడా చూడటం లేదు. అవకాశం వస్తే చాలు ఓకే చెబుతోంది. పాన్ ఇండియా స్టార్ అయినా.. ఆ మూవీలో చేసేందుకు ఒక్క రూపాయి కూడా తగ్గించడం లేదు. అవును.. ప్రభాస్‌తో శ్రీలీల నటిస్తోందని తెలిసింది. ఆ మూవీ కోసం ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. మూవీకి శ్రీ లీల అయితే సూట్ అవుతుందని దర్శకుడు చెప్పడంతో.. నిర్మాతలు కూడా ఓకే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లాంటి స్టార్‌తో నటించడం అంటే మాముల విషయం కాదు. కానీ శ్రీలీల.. డార్లింగ్ మూవీ కోసం కూడా తగ్గించడం లేదు. ఏకంగా రూ.5 కోట్లు తీసుకుందని తెలిసింది.