Big Shock: బిగ్ బాస్ సీజన్ 7లో ఉల్టా పుల్టా.. చెప్పినట్టే అంతా రివర్స్‌గా జరుగుతోంది. గతంలో మాదిరిగా రూల్స్ లేవు. వీకెండ్ వచ్చిందంటే.. చాలు ఎవరు ఉంటారో.. వస్తారో తెలియడం లేదు. హోస్ట్ నాగార్జున (nagarjuna) ఎవరికీ క్లాస్ ఇస్తారో కూడా క్లారిటీ లేదు. ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో చూపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు.
గతంలో ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభశ్రీ రీ ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు వచ్చారు.. కంటెస్టెంట్స్‌గా మాత్రం కనిపించడం లేదు. చేతుల్లో లగేజ్ బాగ్స్ లేవు. గెస్ట్‌గా వచ్చినట్టే అనిపిస్తోంది. ఆ ముగ్గురిలో టాస్క్ ఇచ్చి దాంతో ముగ్గురిలో ఒక్కరు.. ఇద్దరికీ ఛాన్స్ ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు వచ్చారు. ఇప్పుడు ముగ్గురిని రీ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. ముగ్గురిలో ఒక్కరికైనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఏం జరుగుతుందో చూడాలీ. కెప్టెన్ అయ్యాక యావర్ ప్రిన్స్ బిహెవియర్ మారింది అన్నట్టు మరో ప్రోమో వదిలారు. నియంతలా ప్రవర్తించొద్దు యావర్ అని నాగార్జున క్లాస్ కూడా తీసుకున్నారు.