Jai Hanuman: జై హనుమాన్.. ప్రామిస్ చేసిన ప్రశాంత్ వర్మ!
ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సీక్వెల్ సినిమాల్లో జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. హనుమాన్ సినిమాను లో బడ్జెట్లో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా జై హనుమాన్ కోసం ప్రామిస్ చేశాడు ప్రశాంత్.
Jai Hanuman: Prashanth Varma promised Jai Hanuman!
Jai Hanuman: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ సినిమా. ఇక హనుమాన్ క్లైమాక్స్‌లో ఇచ్చిన గూస్ బంప్స్ని ఆడియెన్స్ అంత ఈజీగా మరిచిపోలేరు. హనుమాన్ ఎంట్రీతో రోమాలు నిక్కబొడిచేలా చేసిన ప్రశాంత్ వర్మ.. సీక్వెల్ అంతకుమించి అనేలా ఉంటుందని చెబుతున్నాడు.
జై హనుమాన్ మూవీని చాలా గ్రాండియర్‌గా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? ఎప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. 2025లో జై హనుమాన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా.. జై హనుమాన్ అప్డేట్ ఇస్తూ సాలిడ్ ప్రామిస్ చేశాడు ప్రశాంత్. శ్రీ రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా ఓ పోస్టర్ డిజైన్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.
ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడింది.. అది కలియుగంలో రక్షించబడుతుంది.. అని చిత్ర యూనిట్ రాసుకొచ్చారు. ప్రశాంత్ వర్మ మాత్రం ఆడియెన్స్‌కు ప్రామిస్ చేశాడు. శ్రీరామనవమి సందర్భంగా.. శ్రీరాముడి ఆశీర్వాదంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా ప్రామిస్, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ టైం సెలబ్రేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని మీకు అందిస్తానని.. రాసుకొచ్చాడు. కాబట్టి.. జై హనుమాన్ మామూలుగా ఉండదనే చెప్పాలి