దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.
Ayodhya: దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. దాదాపు 500ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలను అయోధ్యలో వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. అయోధ్యకు లక్షలాది మంది భక్తులు వస్తున్న దృష్ట్యా సౌకర్యాలు, పటిష్ట ఏర్పాట్లు చేశారు. 1,11,111 కిలోల లడ్డూలను ఆయన భక్తులకు ప్రసాదంగా అయోధ్య రాముడికి పంపనున్నారు.
రామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది అయోధ్యలోని బలరాముడిని దర్శించుకుంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్య రాముడి దర్శన వేళలను మూడు రోజుల పాటు పొడిగించిన ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో వీఐపీ దర్శనాలు లేవు. కేవలం కావాలంటే అందరితో పాటు దర్శనం చేసుకోవాలి.
కాశీ విశ్వనాథ దేవాలయం, తిరుపతి బాలాజీ ఆలయాలకు ఇప్పటికే ప్రతి వారం లడ్డూ ప్రసాదం పంపుతున్నట్లు తెలిపారు. జనవరి 22న అయోధ్యలోని దేవ్రాహ్ హన్స్ బాబా ఆశ్రమం నుంచి 40,000 కిలోల లడ్డూలను పంపినట్లు వెల్లడించారు. రామ నవమి సందర్భంగా అయోధ్యలో శ్రీరాముడికి 1,11,111 కిలోల లడ్డూలను సమర్పించనున్నారు. దేవరహ హన్స్ బాబా. ఇది కూడా స్వామి సేవలో భాగమే అంటున్నారు హన్స్ బాబా.