»Jai Hanuman Jai Hanuman First Look Release Time Fixed
Jai Hanuman: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్?
హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Jai Hanuman: చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ మూవీ.. హనుమంతుడి వైబ్‌తో పాన్ ఇండియా రేంజ్లో దుమ్ముదులిపేసింది. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో సీక్వెల్‌గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ సినిమాను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. శ్రీరాముడిగా, హనుమంతుడిగా స్టార్ హీరోలను ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రశాంత్. హనుమాన్ సినిమాలో క్లైమాక్స్‌లో తెప్పించిన గూస్ బంప్స్‌ను.. ఈసారి రెండు గంటల పాటు ఇస్తానని చెబుతున్నాడు. దీంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్.. త్వరలోనే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇక ఇప్పుడు దానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఏప్రిల్‌లోనే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రానుందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ ఉగాది కానుకగా ఏప్రిల్ 9న జై హనుమాన్ ఫస్ట్ లుక్ బయటికి రావచ్చని సమాచారం. వీలైనంత త్వరలో దీనిపై అధికారిక క్లారిటీ రానుందని అంటున్నారు.
ఇక్కడి నుంచి జై హనుమాన్ పై అంచనాలు మరింతగా పెరగడం గ్యారెంటీ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఏడాదిలోనే ఈ హిట్ సీక్వెల్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. మరి నెక్స్ట్ రానున్న క్రేజీ సీక్వెల్‌తో ప్రశాంత్ వర్మ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.