హనుమాన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈరోజు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Mirai: హనుమాన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తేజ ఖాతాలో మరో హిట్ పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు.
ఈరోజు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరయ్ సినిమాలో మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌తో పాటు అతని పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బ్లాక్ స్వార్డ్ అనే డేంజర్ కత్తితో యుద్ధాలు చేస్తున్నట్లు సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతో గ్లింప్స్‌ను ఈ మూవీ మేకర్స్ రిలిజ్ చేశారు. ఈ సినిమాలో మనోజ్ అత్యంత ప్రమాదకరమైన విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు ఇంకా భారీగా పెరుగుతున్నాయి. మనోజ్ చాలా రోజుల తర్వాత కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఈ సినిమా మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పశ్చాతాపంతో యోగిగా మారుతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ఆపదలో ఉంటుంది. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే హీరో తేజ సజ్జా. మరి ఆ గ్రంథాలను కాపాడటానికి హీరో ఏం చేశాడు. విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్ ఏం చేస్తాడనేది మూవీ స్టోరీ.