గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కరుణడ చక్రవర్తికి వెల్కమ్ చెబుతూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
RC16: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే చరణ్ ఈ సినిమాలో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశాడు. దీంతో.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. త్వరలోనే బుచ్చిబాబు RC16 ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు చేసుకొని.. చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు.
గేమ్ చేంజర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి.. ఆగష్టు నుంచి ఆర్సీ 16 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తూ ఉండగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా.. వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందని ప్రచారంలో ఉంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Kalki 2898 AD: వెయ్యి కోట్ల క్లబ్లో ‘కల్కి’.. ప్రభాస్ కొత్త రికార్డ్!
తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆయన పుట్టినరోజు సందర్భంగా RC16 చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి.. ‘కరుణడ చక్రవర్తి’కి స్వాగతం అని పేర్కొంది. RC16 టీమ్ తరపున శివన్నకి జన్మదిన శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. ఇక ఈరోజుతో శివన్న 61 పడిలోకి అడుగుపెట్టారు. మరి కరుణడ చక్రవర్తి ఆర్సీ 16లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.